Sadhguru in Muscat
 - ప్రత్యక్షంగా in 4d : 12h : 16m
మట్టికార్యక్రమాలుమద్దతుదారులుఉద్యమం గురించి
ఇప్పుడే స్పందించండి
Background

చైతన్యవంతమైన ప్రపంచం

చైతన్యవంతమైన ప్రపంచం అనే ఉద్యమం మానవులలో స్పృహను పెంపొందించడానికి ఇంకా మన సమాజపు అనేక రకాల కార్యకలాపాలు స్పృహతో చేసేలా అందరినీ కలుపుకొని పోయేలా చేసే ప్రయత్నం. మన గ్రహం మీద ప్రకృతికి ఇంకా అన్ని జీవులకు సహకారంగా మానవ కార్యకలాపాలను సమలేఖనం చేసే ప్రయత్నం. మానవులు పెద్ద సంఖ్యలో స్పృహతో పనిచేసే, ప్రభుత్వాలను స్పృహతో ఎన్నుకునే, పర్యావరణ సమస్యలు ప్రపంచంలో ఎన్నికల సమస్యలుగా మారే గ్రహాన్ని సృష్టించడమే మా పని.

మరింత చదవండి

మట్టిని రక్షించు ఉద్యమం ఇలా పనిచేస్తుంది:

1

జీవం కోల్పోతున్న మట్టి వైపుకి ప్రపంచ దృష్టిని మళ్ళించడం.

2

మట్టిని రక్షించడానికి, పోషించి నిలబెట్టడానికి విధివిధానాలలో మార్పులు తీసుకురావడానికి దాదాపు 350 కోట్ల ప్రజల (ప్రపంచంలోని 526 కోట్ల ఓటర్లలో 60%) మద్దతుని కూడగడుతుంది.

3

మట్టిలోని సేంద్రీయ పదార్ధాన్ని కనీసం 3-6%కి పెంచి, ఆ స్థాయిని కొనసాగించడం కోసం 193 దేశాల జాతీయ విధానాలలో మార్పులను తీసుకురావడం.

Soil Revitalization - Global Policy Draft & Solutions Handbook

Read
policy
background
Sadhguru

సద్గురు

యోగి, మార్మికుడు ఇంకా దార్శనికుడు అయిన సద్గురు, మన కాలంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరు. అపారమైన సామర్ధ్యం కలిగిన గురువు, ఆయన కొన్ని అద్భుతమైన సవాళ్ళను చేపట్టారు, అది వైవిధ్యభరితమైన పని.

ఏది ఏమైనప్పటికీ, సద్గురు ప్రయత్నాలన్నీ ఎల్లప్పుడూ ఒకే లక్ష్యం వైపు ఉండేవి: మానవ స్పృహను పెంచడం. గత నాలుగు దశాబ్దాలుగా, సద్గురు తన ఫౌండేషన్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల క్షేమం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించారు, దీనికి ప్రపంచవ్యాప్తంగా కోటి 60 లక్షలకు పైగా వాలంటీర్లు మద్దతు ఇస్తున్నారు. సద్గురుకు మూడు రాష్ట్రపతి పురస్కారాలు లభించాయి, వీటిలో 2010లో దేశానికి విశిష్ట సేవలందించినందుకు పద్మవిభూషణ్ ఇంకా భారతదేశ అత్యున్నత పర్యావరణ పురస్కారమైన ఇందిరా గాంధీ పర్యావరణ పురస్కారం ఉన్నాయి.

మరింత చదవండి

మట్టిని రక్షించు: 24 సంవత్సరాల క్రితం మొదలైన ఉద్యమం

గత మూడు దశాబ్దాలుగా, సద్గురు మట్టి ప్రాముఖ్యతను ఇంకా తీవ్ర స్థాయిలో జరుగుతున్న మట్టి వినాశనం గురించి ప్రస్తావిస్తున్నారు. ఆయన ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ వేదికలపై ఎన్నోసార్లు ప్రస్తావించారు: "మట్టి మన జీవం, మన శరీర మూలం. మనం మట్టిని కోల్పోతే, అనేక విధాలుగా భూగ్రహాన్ని కోల్పోతాము."

మట్టిని రక్షించేదెవరు?

Tree

1990లో. గ్రామీణ తమిళనాడు. కొంతమంది ఆకులతో కళకళలాడుతున్న ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నారు. కొంతసేపటి క్రితం, వారు దక్షిణ భారత సూర్యుని తీవ్రమైన ఎండలో చెమటలతో బయట కూర్చొని ఉన్నారు. ఇప్పుడు, చక్కటి నీడలో కూర్చొని, చల్లటి గాలి వీస్తూండగా, ఆ చెట్టు స్వభావాన్ని ఇంకా దీవెనని గ్రహించారు.

వారు చెట్టుతో జరిపే శ్వాస మార్పిడి, అంటే వారు వదిలే కార్బన్ డయాక్సైడ్ చెట్టు పీల్చుకోవడం, చెట్టు వదిలే ఆక్సిజన్ ను వారు పీల్చుకోవడాన్ని అవగాహనలోకి తెచ్చే ఆంతరంగిక ప్రక్రియను అనుభూతి చెందేలా సద్గురు చేశారు. వారి శ్వాసలో సగం అక్కడ అనుసంధానమై ఉందని వారు స్పష్టంగా తెలుసుకున్న ఒక అనుభవపూర్వక ప్రక్రియ. సద్గురు అంటారు "అత్యంత కష్టతరమైన భూభాగం - ప్రజల మనసులు" అని. అలా ప్రజల మనసుల్లో చెట్లను నాటడం ప్రారంభించిన తొలి రోజులవి. అన్ని జీవులతో ఏకత్వాన్ని ప్రత్యక్షంగా అనుభవం పొందిన మొదటి కొంతమంది ఉత్సాహవంతమైన వాలంటీర్లు మన భూమిని, ఈ గ్రహాన్ని, పునరుద్ధరించడానికి ఈ ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించారు.

1990వ దశకంలో వెల్లెంగిరి కొండలను పచ్చగా మార్చే లక్ష్యంతో వనశ్రీ అనే ఎకో-డ్రైవ్ రూపంలో కొన్ని వేల మంది వాలంటీర్లతో ప్రారంభమైన ఈ కార్యక్రమం తక్కువ సమయంలోనే ప్రాజెక్ట్ గ్రీన్‌హ్యాండ్స్‌గా మారింది. ఇది 20వ దశాబ్దం మొదట్లో తమిళనాడు అంతటా కొన్ని లక్షల మంది వాలంటీర్లతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన కార్యక్రమం. 2017లో, సద్గురు అద్భుతమైన ర్యాలీ ఫర్ రివర్స్ కి నాయకత్వం వహించినప్పుడు, అది 16.2 కోట్ల మంది భారతీయుల మద్దతుతో ప్రపంచంలో అతిపెద్ద పర్యావరణ ఉద్యమంగా మారింది, ఇది అత్యంత ప్రయోగాత్మకమైన, ప్రూఫ్-ఆఫ్-కాన్సెప్ట్ ప్రాజెక్ట్ కావేరి పిలుపుతో ఉత్తమమైన కార్యాచరణకు దారితీసింది. ఇప్పుడు, చైతన్యవంతమైన ప్రపంచాన్ని సృష్టించడానికి ఇంకా మట్టిని రక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా కోట్లకొద్దీ పౌరులు ఈ అపూర్వమైన ఉద్యమంలో పాల్గొననున్నారు. భూమిపై 350 కోట్లమంది ప్రజలను చేరుకోవాలనే సద్గురు లక్ష్యం మూడు దశాబ్దాల కృషికి, వికాసానికి ఫలితం.

ఈ ఉద్యమ పరిణామంలో కీలకమైన అంశాలలో ఒకటి, అది ప్రేరేపించిన వ్యక్తుల సంఖ్య అని నిస్సందేహంగా చెప్పవచ్చు. అయినప్పటికీ, దాని ప్రభావం పెరుగుతున్న స్థాయి కూడా అంతే ముఖ్యమైనది. స్థానిక కమ్యూనిటీలు, సంస్థలు, రైతులు, పాఠశాలలు ఇంకా రాష్ట్ర ప్రభుత్వాల నుండి, భారతదేశంలో జాతీయ నదీ విధానాన్ని రూపొందించడంలో సహాయం చేయడంతోపాటు ఇప్పుడు పర్యావరణానికి సంబంధించిన కొన్ని అంతర్జాతీయ ఏజెన్సీలు, ప్రపంచ నాయకులు ఇంకా ప్రభుత్వాలతో కలిసి పనిచేయడం వరకు - గత మూడు దశాబ్దాలుగా ఉద్యమం పెద్ద అడుగులు వేస్తోంది.

మట్టిని రక్షించు ఉద్యమం, ప్రజాస్వామ్య ప్రపంచంలోని పౌరులందరిని ఆరోగ్యం కోసం ఇంకా భూమి భవిష్యత్తు కోసం మనకున్న నిబద్ధతను తెలియజేయడానికి ఒకే గళంగా ఏకం చేయడానికి చేసే, అద్భుతమైన ప్రయత్నం. జీవావరణ సమస్యలు ఎన్నికల సమస్యలుగా మారినప్పుడు, మట్టిని రక్షించడానికి దీర్ఘకాలిక విధాన మార్పులను అనుసరించడానికి ప్రజల మద్దతుతో ప్రభుత్వాలకు అధికారం ఇచ్చినప్పుడు, వ్యాపారాలు, సంస్థలు, ప్రజలు ఇంకా ప్రభుత్వాలు మట్టి ఆరోగ్యానికి ప్రధమ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు - ఈ నిరంతర ప్రయత్నం ఫలిస్తుంది.

ఇది గ్రీన్ హెడ్స్ నుండి గ్రీన్ హ్యాండ్స్ కు, గ్రీన్ హ్యాండ్స్ నుండి గ్రీన్ హార్ట్స్ కు ప్రయాణం. కాబట్టి మట్టిని ఎవరు కాపాడుతారు? మనలో ప్రతి ఒక్కరూ.

మనం ఇది సాకారం చేద్దాం!

మనం ఇది సాకారం చేద్దాం!

ఇప్పుడే స్పందించండి
footerLogo

మట్టి

© 2022 Conscious Planet All Rights Reserved

Privacy Policy

Terms & Conditions