52%
వ్యవసాయ భూములు ఇప్పటికే నిస్సారమయ్యాయి
మట్టిని ఎందుకు రక్షించాలి?
సద్గురు ప్రారంభించిన మట్టిని రక్షించు అనే ప్రపంచ ఉద్యమం , మట్టి ఆరోగ్యం కోసం పాటుపడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా మట్టి సంక్షోభాన్ని పరిష్కరించడానికి, సాగు చేయదగిన మట్టిలో సేంద్రియ పదార్థాలను పెంచడానికి జాతీయ విధి విధానాలు ఏర్పాటు చేసి, కార్యరూపం దాల్చడానికి అన్ని దేశాల నాయకులకు మద్దతు ఇస్తుంది.
మట్టిని రక్షించు(Save Soil) సందేశం
మట్టిని రక్షించు అనే ఉద్యమం యోగి, మార్మికుడు ఇంకా దార్శనికులు అయిన సద్గురుచే ప్రారంభించబడింది.
సంక్షోభం
సేంద్రియ పదార్ధాలు లేని మట్టి ఇసుకగా మారుతుంది, తద్వారా:
ఆహార సంక్షోభం
20 సంవత్సరాలలో, 930 కోట్ల మంది ప్రజలు ఉండగా ఆహారం మాత్రం 40% తక్కువ ఉత్పత్తి అవుతుందని అంచనా.
సారం లేని మట్టి పోషక విలువలు లేని ఆహారాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇప్పటికే పళ్ళు కూరగాయలలో పోషకాలు 90% వరకు తగ్గిపోయాయి.
200 కోట్ల మంది ప్రజలు అనేక రకాల వ్యాధులకు దారితీసే పోషకాహార లోపాలతో బాధపడుతున్నారు.
నీటి కొరత
క్షీణించిన మట్టి నీటిని గ్రహించలేదు ఇంకా ప్రవాహాన్ని నియంత్రించలేదు.
నీటి నిలుపుదల లేకపోవడం నీటి కొరత, కరువులు ఇంకా వరదలకు దారితీస్తుంది.
సేంద్రీయ పదార్థం దాని బరువులో 90% వరకు నీటిని పట్టి ఉంచగలదు, కాలక్రమేణా నెమ్మదిగా నీటిని విడుదల చేస్తుంది. కరువు పీడిత ప్రాంతాలకు ఇది చాలా సహాయకరంగా ఉంటుంది.
జీవవైవిధ్యంలో నష్టం
ఆవాసాలను కోల్పోవడం వల్ల ప్రతి సంవత్సరం దాదాపు 27000 రకాల జీవులు అంతరించిపోతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
80% పురుగుల జీవపదార్ధం పోయే స్థాయికి సంక్షోభం చేరుకుంది.
జీవవైవిధ్యం కోల్పోవడం వల్ల నేల ఆవాసాలకు అంతరాయం ఏర్పడుతుంది ఇంకా మట్టి పునరుజ్జీవనాన్నీ నిరోధిస్తుంది.
వాతావరణ మార్పు
మట్టిలో కార్బన్, మొక్కల కంటే 3 రెట్లు, వాతావరణంలో కంటే 2 రెట్లు ఎక్కువగా నిల్వ ఉంటుంది. అంటే కార్బన్ ను గ్రహించడానికి మట్టి ఎంతో కీలకం అని అర్ధం.
ప్రపంచవ్యాప్తంగా మట్టిని పునరుజ్జీవింపజేయకపోతే, అది వాతావరణ మార్పులకు దోహదపడే 850 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ను వాతావరణంలోకి విడుదల చేస్తుంది. ఇది గత 30 సంవత్సరాలలో మానవాళి మొత్తం విడుదల చేసిన ఉద్గారాల కంటే ఎక్కువ.
జీవనోపాధి కోల్పోవడం
భూసారం తగ్గడం వల్ల వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా భూమి క్షీణత వల్ల 74% మంది పేదలు ప్రత్యక్షంగా ప్రభావితమవుతున్నారు.
మట్టి వినాశనం అవ్వడం వల్ల ప్రపంచానికి ప్రతి ఏటా US$ 10.6 ట్రిలియన్ల వరకు ఖర్చవుతుందని అంచనా.
సంఘర్షణ ఇంకా వలస
జనాభా పెరుగుదల ఇంకా ఆహార, నీటి కొరత కారణంగా 2050 నాటికి 100 కోట్ల మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు దేశాలకు వలస వెళ్ళవచ్చు.
1990 నుండి ఆఫ్రికాలో జరిగిన 90% పైగా ప్రధాన యుద్ధాలు ఇంకా ఘర్షణలలో భూమి సమస్యలు ముఖ్యమైన పాత్ర పోషించాయి.
ఫ్రెంచ్ విప్లవం నుండి అరబ్ స్ప్రింగ్ వరకు, సామూహిక నిరసన ఉద్యమాల వెనుక అధిక ఆహార ధరలు ఒక కారకంగా పేర్కొనబడ్డాయి
జీవంతో ఉన్న మట్టి
పరిష్కారం
మట్టిలో కనీసం 3-6% సేంద్రీయ పదార్ధాన్ని తిరిగి తీసుకురావాలి
నేలని చెట్ల నీడలో ఉంచడం ఇంకా చెట్లు, జంతువుల వ్యర్ధాల ద్వారా మట్టిని సమృద్ది చేయాలి.
జీవంతో వర్ధిల్లే మట్టి జీవితానికి కీలకం.
ప్రణాళిక
మట్టి ఆరోగ్యానికి
ప్రతి దేశంలో సహాయక విధానాలు అవసరంవిధానాలకు
ప్రజల మద్దతు అవసరంప్రజల మద్దతుకు
అవగాహన అవసరంవిధానాల ప్రాముఖ్యత ఏమిటి?
మరింత తెలుసుకోండి
చర్య
సందేశాన్ని 350 కోట్ల మంది ప్రజలకు చేరవేయండి,
ప్రపంచ ఓటర్లలో 60%
మట్టిని రక్షించడానికి చేసే ప్రయాణం
సద్గురు యునైటెడ్ కింగ్డమ్ నుండి భారతదేశానికి 100 రోజులలో 25 దేశాల గుండా 30,000 కి.మీల దూరం ఒంటరి మోటార్సైకిలిస్ట్గా ప్రయాణిస్తూ పౌరులను, నాయకులను ఇంకా నిపుణులను కలిసేందుకు ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు.
జరగబోయే కార్యక్రమాలు
Sadhguru in Muscat - Oman Convention and Exhibition Centre,
Wed, May 25 19:00 - 21:00 GST
మద్దతు తెలిపిన వారు ఏం చెబుతున్నారో వినండి
మట్టి ఆరోగ్యాన్ని పునరుద్దరించే ఏకైక లక్ష్యం కోసం వేలాది మంది ప్రముఖ వ్యక్తులు, సంస్థలు ఏకమవుతున్నాయి.
సహాయక సంస్థలు
నేను ఏం చేయగలను??
మట్టి కోసం గళం విప్పండి!
మీకు సాధ్యమైనంత వరకు మట్టి గురించి ప్రపంచం మాట్లాడుకునేలా చేయండి
మీడియాలో
#SaveSoil
మనం ఇది సాకారం చేద్దాం!